garuda gamana garudadhvaja

అన్నమయ్య కీర్తన గరుడ గమన గరుడధ్వజ గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో ॥ కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక । కమలనయన కమలాప్తకుల నమోనమో హరి నమో నమో ॥ జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల । జలధిజామాత జలధిగంభీర హలధర నమో హరి నమో ॥ ఘనదివ్యరూప ఘనమహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ । అనఘ శ్రీవేంకటాధిపతేహం నమో నమోహరి నమో నమో ॥