అన్నమయ్య కీర్తన గాలినే పోయ గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు ॥ అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము । ఒడలికి జీవుని కొడయడైనహరి దడవగా గొంతయు బొద్దులేదు ॥ కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము । తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు । శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె గరిమల గపటాల గలకాలము । తిరువేంకటగిరి దేవుడైనహరి దరిచేరా …
