endaro mahanubhavulu

త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: శ్రీ తాళం: ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ …