emoko chigurutadharamuna

అన్నమయ్య కీర్తన ఏమొకో చిగురుటధరమున ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను । భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ॥ కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన । చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు । నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు । నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా ॥ పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల । కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు । వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు । వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా ॥ ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల …