ele ele maradalaa

అన్నమయ్య కీర్తన ఏలే ఏలే మరదలా ఏలే యేలే మరదలా చాలుజాలు । చాలును చాలు నీతోడి సరసంబు బావ ॥ గాటపు గుబ్బలు గదలగ గులికేవు । మాటల దేటల మరదలా । చీటికి మాటికి జెనకేవే వట్టి । బూటకాలు మానిపోవే బావ ॥ అందిందె నన్ను నదలించి వేసేవు । మందమేలపు మరదలా । సందుకో దిరిగేవి సటకారివో బావ । పొందుగాదిక బోవే బావ ॥ చొక్కపు గిలిగింతల చూపుల నన్ను …