ekkuva kulajudaina

అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన రాగం: సామంతం ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ (2.5) చరణం 1 వేదములు చదివియును విముఖుడై హరిభక్తి యాదరించని సోమయాజి కంటె । (2) ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు …