అన్నమయ్య కీర్తన రామా దశరథ రామా రామ దశరథరామ నిజ సత్య- కామ నమో నమో కాకుత్థ్సరామ ॥ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతిరామ । శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ ॥ దనుజహరణ రామ దశరథసుత రామ వినుతామర స్తోత్ర విజయరామ । మనుజావతారా రామ మహనీయ గుణరామ అనిలజప్రియ రామ అయోధ్యరామ ॥ సులలితయశ రామ సుగ్రీవ వరద రామ కలుష …
