అన్నమయ్య కీర్తన చూడరమ్మ సతులారా చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ । కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ॥ శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు । కాముని తల్లియట చక్కదనాలకే మరుదు । సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు । కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ॥ కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు । తలపలోక మాతయట దయ మరి ఏమరుదు । జలజనివాసినియట చల్లదనమేమరుదు । కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ॥ అమరవందితయట …
