అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి రాగం: పాడి చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా ॥ కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుభళా । పలుకుల సొంపుల బతితో గసరెడి చలముల యలుకకు చాంగుభళా ॥ కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా । ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా ॥ జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుభళా । …
