అన్నమయ్య కీర్తన చాలదా బ్రహ్మమిది చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు । జాలెల్ల నడగించు సంకీర్తనమ్ ॥ సంతోష కరమైన సంకీర్తనమ్ । సంతాప మణగించు సంకీర్తనమ్ । జంతువుల రక్షించు సంకీర్తనమ్ । సంతతము దలచుడీ సంకీర్తనమ్ ॥ సామజము గాంచినది సంకీర్తనమ్ । సామమున కెక్కుడీ సంకీర్తనమ్ । సామీప్య మిందరికి సంకీర్తనమ్ । సామాన్యమా విష్ణు సంకీర్తనమ్ ॥ జముబారి విడిపించు సంకీర్తనమ్ । సమ బుద్ధి వొడమించు సంకీర్తనమ్ । జమళి …
