పరమాత్ముడు వెలిగే రాగం: వాగధీశ్వరీ తాళం: ఆది పల్లవి పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే అనుపల్లవి హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులటయందరిలో (పరమ) చరనం గగనాఅనిల తేజో-జల భూ-మయమగు మృగ ఖగ నగ తరు కోటులలో 5సగుణములో 6విగుణములో సతతము సాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)
