daachuko nee paadaalaku

అన్నమయ్య కీర్తన దాచుకో నీ పాదాలకు రాగం: ఆరభి దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి । పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ॥ వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ । తక్కినవి భాండారాన దాచి వుండనీ । వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము । దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా ॥ నానాలికపైనుండి నానాసంకీర్తనలు । పూని నాచే నిన్ను బొగడించితివి । వేనామాల వెన్నుడా …