అన్నమయ్య కీర్తన తిరుమల గిరి రాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ । సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥ సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ । సరసవైభవరాయ సకలవినోదరాయ । వరవసంతములరాయ వనితలవిటరాయ । గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ॥ గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ । చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ । చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ । కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ॥ సామసంగీతరాయ సర్వమోహనరాయ । ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ । కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను । శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ॥
