adigo bhadradri

అదిగో భద్రాద్రి రాగం: వరాళి తాళం: ఆది అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ॥ అదిగో ॥ ముదముతో సీత ముదిత లక్ష్మణుడు కదసి కొలువగా కలడదె రఘుపతి ॥ 1 ॥ అదిగో ॥ చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై యుండెడి ॥ 2 ॥ అదిగో ॥ అనుపమానమై అతిసుందరమై తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి ॥ 3 ॥ అదిగో ॥ కలియుగమందున నిల వైకుంఠము నలరుచునున్నది …