అన్నమయ్య కీర్తన వేదం బెవ్వని వేదం బెవ్వని వెదకెడివి । ఆదేవుని గొనియాడుడీ ॥ అలరిన చైతన్యాత్మకు డెవ్వడు । కలడెవ్వ డెచట గలడనిన । తలతు రెవ్వనిని దనువియోగదశ । యిల నాతని భజియించుడీ ॥ కడగి సకలరక్షకు డిందెవ్వడు । వడి నింతయు నెవ్వనిమయము । పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని । దడవిన ఘనుడాతని గనుడు ॥ కదసి సకలలోకంబుల వారలు । యిదివో కొలిచెద రెవ్వనిని । త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి । …
