అన్నమయ్య కీర్తన త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా ॥ వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా । భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా ॥ బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద । సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా ॥ వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా । పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా ॥
