Sabarimala yatra మాలయిడల్ : శబరిమల యాత్ర ఇంద్రియాలకు పరీక్ష. భక్తులు సాధారణమైన నిశ్చల జీవనాన్ని ’వ్రతం’ అనే పేరుతో జీవించి, యాత్రను పూర్తిచేయాలి. ’వ్రతం’ భక్తుడు మాల ధారణ చేసిన నాటి నుంచి, బ్రహ్మచర్యాన్ని పాటించడంతో ప్రారంభమౌతుంది. పూసల మాలలో అయ్యప్ప స్వామి బొమ్మ గల పతకంతో మాలను ధరించిన నాటినుంచి భక్తుడు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి. పొగాకు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. విధిగా పూజ చేసిన తర్వాత, పూజారి చేతగాని, …
