అన్నమయ్య కీర్తన మేదిని జీవుల గావ మేదిని జీవుల గావ మేలుకోవయ్యా । నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥ తగుగోపికల కన్నుదామరలు వికసించె మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా । తెగువ రాక్షసులనే తిమిరము విరియగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ॥ ఘనదురితపు గలువలు వికసించె మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా । పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ॥ వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ మెరయు దోషరహిత మేలుకోవయ్యా …
