hari yavataara mitadu

అన్నమయ్య కీర్తన హరి యవతార మితడు హరి యవతార మీతడు అన్నమయ్య । అరయ మా గురుడీతడు అన్నమయ్య । వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య । ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ॥ ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య । భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య …