అన్నమయ్య కీర్తన గోవిందాశ్రిత గోకులబృందా గోవిందాశ్రిత గోకులబృందా । పావన జయజయ పరమానంద ॥ జగదభిరామ సహస్రనామ । సుగుణధామ సంస్తుతనామ । గగనశ్యామ ఘనరిపు భీమ । అగణిత రఘువంశాంబుధి సోమ ॥ జననుత చరణా శరణ్యు శరణా । దనుజ హరణ లలిత స్వరణా । అనఘ చరణాయత భూభరణా । దినకర సన్నిభ దివ్యాభరణా ॥ గరుడ తురంగా కారోత్తుంగా । శరధి భంగా ఫణి శయనాంగా । కరుణాపాంగా కమల సంగా …
