Desamunu preminchumanna దేశమును ప్రేమించుమన్న (గురజాడ అప్పారావు ) దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ ! పాడిపంటలుపొంగి పొర్లే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ! ఈసురోమని మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్ జల్డుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్ ! అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్ దేశి సరుకులు నమ్మవెలె నోయ్ డబ్బు తేలేనట్టి …
