Bhu suktam – భూ సూక్తం తైత్తిరీయ సంహితా – 1.5.3 తైత్తిరీయ బ్రాహ్మణం – 3.1.2 ఓమ్ ॥ ఓం భూమి॑ర్భూ॒మ్నా ద్యౌర్వ॑రి॒ణాఽంతరి॑క్షం మహి॒త్వా । ఉ॒పస్థే॑ తే దేవ్యదితే॒ఽగ్నిమ॑న్నా॒ద-మ॒న్నాద్యా॒యాద॑ధే ॥ ఆఽయంగౌః పృశ్ఞి॑రక్రమీ॒-దస॑నన్మా॒తరం॒ పునః॑ । పి॒తరం॑ చ ప్ర॒యంథ్-సువః॑ ॥ త్రి॒గ్ం॒శద్ధామ॒ విరా॑జతి॒ వాక్ప॑తం॒గాయ॑ శిశ్రియే । ప్రత్య॑స్య వహ॒ద్యుభిః॑ ॥ అ॒స్య ప్రా॒ణాద॑పాన॒త్యం॑తశ్చ॑రతి రోచ॒నా । వ్య॑ఖ్యన్-మహి॒షః సువః॑ ॥ యత్త్వా᳚ క్రు॒ద్ధః ప॑రో॒వప॑మ॒న్యునా॒ యదవ॑ర్త్యా । సు॒కల్ప॑మగ్నే॒ తత్తవ॒ పున॒స్త్వోద్దీ॑పయామసి …
