sri kalahastiswara satakam

sri kalahastiswara satakam – శ్రీ కాళ హస్తీశ్వర శతకం శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా-జీమూతపాపాంబుధా- రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁ గోల్పోయితిన్ । దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా- సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥ వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 2 ॥ అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ …