అన్నమయ్య కీర్తన అన్ని మంత్రములు రాగం: అమృతవర్షిణి ఆ: స గ3 మ2 ప ని3 స అవ: స ని3 ప మ2 గ3 స తాళం: ఆది పల్లవి అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2.5) చరణం 1 నారదుండు జపియించె నారాయణ మంత్రము చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము । (2) కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2) అన్ని …
