Sri Vancha Kalpa Ganapati Homam

image_print

Sri Vancha Kalpa Ganapati Homam-శ్రీ వాంచా కల్ప గణపతి హోమం

ఈ పేరును చెబితే మహదానందం కలుగుతుంది. అంతటి ఆకర్షణ ఈ పేరులో గలదు. ఇతర ఏ హోమానికి ఇంతటి ఆకర్షణ గల పేరు లేదు.
చండి హోమం, గణపతి హోమం మృత్యంజయ హోమం, నవగ్రహ హోమం అంటూ చేసి అలవాటు బడ్డ మనకు శ్రీ వాంచా కల్ప గణపతి హోమం పేరు వినడానికి కొత్తగా ఉంటుంది.
వాంచా అంటే కోరిక. కల్ప అంటే కల్పతరువు వలే తలచినవాటిని ఇవ్వగలదు. మన కోరికలను కల్ప వృక్షం వలే నెరవేర్చే శ్రీ మహా గణపతే ఈ హోమానికి ప్రధాన దైవం.
అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరటానికి, సత్ఫలితాలను పొందటానికి, సకల దోషాలు తొలగటానికి ఈ హోమం ఉపకరిస్తుంది.
ఈ హోమ మంత్రానికి మహా గణపతియే ప్రధాన దైవమైనప్పటికి ఇందులో గల మంత్రాలలో మహా మంత్రమగు గాయత్రి, విద్యా మంత్రం, మంత్ర రాజమన బడే పంచదశీ , శ్రీ విధ్యా ఆరాధనకు తొలి మెట్టైన బాలా మంత్రములు దైవ కృపచే కలుప బడి ఉంది.
రుషులు మనస్సులు సదా జనభాహుళ్యం ప్రగతి కొరకే ఆలోచిస్తూ ఉంటాయి.ఆ రుషులే ఇలా మంత్రాలను పొదు పరచి దానిని వరాలను గుప్పించే శక్తి మంత్రంగా రూపు దిద్దారు.
సదా సర్వ కాలము తపస్సు చేస్తుండే రుషుల జ్నాన దృష్ఠిలో రూపాంతరం చెందిన శ్రీ వాంచా కల్ప గణపతి మంత్రం సఖల అస్త్రాలను తనలో కలిగి ఉంది.
“గం” అన్న ది గణప్తియొక్క భీజాక్షరం. ఈ భీజాక్షరాన్ని నిత్యం జపించే వాని మనస్సున గణపతి కొలువున్నాడు.మనస్సు కరిగి ప్రార్థించే వారికి ప్రత్యక్షమవుతాడు
ఈ గం అనే భీజాక్షరం సర్వ జ్నానాన్ని కల్గించగలదు. మూర్ఖుడను సైతం జ్ఞానిగా  చేస్తుంది. మహామంత్రమును    నాలుగు లక్షల నలబై నాలుగు వేల నాలుగువందల నలబై నాలుగు మార్లు  జపించి సిద్ది పొందిన తరువాతే శ్రీ వాంచా కల్ప గణపతి హోమాన్ని నిర్వహించే యోగ్యత భాగ్యం లభిస్తుంది.
గణపతి మూలమంత్ర సిద్ది అన్నదిగణపయ్య కరుణతోనే సాధ్యం.మంత్ర సిద్ది లేక హోమం నిర్వహించటం పొరభాటు. ఈ మంత్ర జపం చేయువారిని దుష్కర్మలు అంటవు, పూర్వ కర్మలు పరుగులు తీస్తాయి. గణపతి మంత్రాన్ని జపించకుండా శ్రీ విద్యా ఆరాధనకు ఉపక్రమించ కూడదు. గణపతి ఉపాసన ఒక్కటే చాలు. వారు ఈ ప్రపంచాన్ని గెలవగలరు. గణపతి మంత్రం జపించను జపించను ఆనందం ఉబుకుతుంది.
మానవుడు తన జీవితం గాడిన పడేందుకు కొన్ని న్యాయ సమ్మతమైన ఆశలు, మరియు కోరికలను భగవంతుని ముందుంచుతాడు.అటువంటి  న్యాయ సమ్మతమైన ఆశలు, మరియు కోరికలను నెరవేర్చుకునేందుకు చేసే హోమమే శ్రీ వాంచా కల్ప గణపతి హోమం. భక్తుల కోరికలను తక్షణం నెరవేర్చే వారు మహా గణపతుల వారు.
వివాహం అయ్యేందుకు:
వివాహ యత్నాల్లొ ఆటంకాలు, వివాహంలో ఆలశ్యం , జాతకాలు కుదరడం లేదు సరైన వరుడు దొరకడం లేదు అంటూ ఎందరో భాధ పడుతున్నారు. వారు ఈ శ్రీ వాంచా కల్ప గణపతి హోమంలో పాల్గిని ప్రార్థించిన యెడల త్వరలో వివాహం జరుగుటకు గణపతి కరుణిస్తాడు.
సంతాన భాగ్యం:
వివాహమై ఎన్నో ఏళ్ళు గడిచినప్పటికి సంతానం కలుగలేదేనని బాధ పడేవారు ఎందరో ఉన్నారు.వీరికి ఈ శ్రీ వాంచా కల్ప గణపతి హోమం అద్భుత పరిష్కారం. ఈ హోమంలో పాల్గిని ప్రార్థించిన యెడల త్వరలో సత్ సంతాన ప్రాప్తికి  గణపతి కరుణిస్తాడు.
నవగ్రహ దోషాలు తొలుగుటకు:
ఇంట సదా పేచీలు, కార్య విఘ్నాలు ,అప్రశాంతత, పేదరికం, అప్పుల బెడద, రోగ పీడలు ఉంటే అక్కడ నవగ్రహ దోషం ఉందని లెక్క. శ్రీ వాంచా కల్ప గణపతి నవగ్రహ దోషాలను పోగొట్టడంలో దిట్ట.
మహా గణపతిని పూజించేవారికి నవగ్రహాల వలన ఎట్టి కీడు జరుగదు. ఈ శ్రీ వాంచా కల్ప గణపతి హోమం నవగ్రహ పీడననుండి విడిపించి సుఖ సంతోషాలను నొసంగుతుంది.
కార్య జయం కొరకు:
ఏ ఒక్క పనిలో దిగినా అందులో పలు విఘ్నాలు ఎదురవడం షరా మామూలే. ఆ విఘ్నాలను భగ్నం చేసి గై కొన్న కార్యంలో జయం కలిగేలా చేసేవాడు మహా గణపతి. కోర్టు వ్యవహారాలు, కార్య విఘ్నాలు, అన్నింటా విజయాన్నిచ్చేవాడు మహా గణపతి. కుటుంభంలో ఐక్య పెరిగేందుకు, విడిపోయిన దంపతులు మళ్ళి కలిసేలా చెయ్యడం కొరకు,  వృత్తి ,వ్యాపారం  ప్రారంభించుటకు, సకల పాపములనుండి విముక్తి పొందేందుకు ,బిల్లి,శూన్యం వంటి వాటినుండి భయిట పడేందుకు ఈ శ్రీ వాంచా కల్ప గణపతి హోమం గొప్ప ఫలితాలను ఇవ్వగలదు. పూర్వ జన్మ పాపాలు , పితృ వర్గాల దోషాలు, పితృ శాపం తొలిగేందుకు, మన:శాంతి కలిగేందుకు, పున: వివాహం జరిగేందుకు, దన దాన్య ప్రాప్తికి, సకల బాధలనుండు విముక్తి పొందేందుకు శ్రీ వాంచా కల్ప గణపతి హోమం ఉపకరిస్తుంది.
శనిగ్రహంచే రాగల సమస్యలు, స్త్ర్రీల వలన కలిగే బాధలు,ఈ హోమాంతో హుష్ కాకి అవుతాయి. అన్ని శుభాలను కలిగించ గల ఈ శ్రీ వాంచా కల్ప గణపతి హోమాన్ని నిర్వహించేవారు,పాల్గొనేవారు సత్ఫలితాలను పొందటం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *