Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in Telugu – సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 2 సార్లు ||
నుదిటి కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక వెలుగా || 2 ||
కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండగా || 2 ||
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||
నిండుగా కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు || 2 ||
గల గల గలమని సవ్వడి చేయగ
సౌభాగ్య వతుల సేవలు నందగ || 2 ||
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||
సౌభాగ్యమ్ముల బంగారు తల్లి
పురందర విఠలుని పట్టపు రాణి || 2 ||
శుక్రవారపు పూజలు నందగా
సాయం సంధ్యా శుభ ఘడియలలో|| 2 ||
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 3 ||
నిత్యసుమంగళి నిత్యకళ్యాణి
భక్తజనులకూ కల్పవల్లి || 2 ||
కమలాసనవై కరుణనిండగా
కనకవృష్టి కురిపించే తల్లి || 2 ||
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||
జనకరాజుని ముద్దుల కొమరిత
రవికులసోముని రమణీమణివై || 2 ||
సాథుసజ్జనుల పూజలందుకొని
శుభములనిచ్చెడి దీవనలీయగ || 2 ||
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||
కుంకుమ శోభిత పంకజలోచని
వెంకటరమణుని పట్టపురాణి || 2 ||
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
పుణ్యమూర్తి మాయింట వెలసిన || 2 ||
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 3 ||