Remedy for nagadhosha

nagadhosha e1695106978390
image_print

Remedy for nagadhosha

సర్పదోషం,నాగదోషం ఎలా దోషము తొలగును? రెమెడీలు ఏమిటి?
సర్పదోషం,నాగదోషం ఎలా దోషము తొలగును? రెమెడీలు ఏమిటి?

జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న ,పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. “కాల సర్పదోషం”(నాగదోషం) కలవారై ఉంటారు.

ఈ దోషం కలవారు వివాహం .., సంతానం.., కుటుంభం.., అభివృద్ధి ..,ఆరోగ్య.., విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.

జాతకచక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు.

జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉన్న ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి.

జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు.

జాతకచక్రంలో సప్తమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న బార్యా భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.

జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడ్తం, పాము కలలు రావటం జరుగుతుంది.

“అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్”

నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి.సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.

నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు.
అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.

దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం చేస్కోవలసి ఉంటుంది..
*నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా ధానదికములు చేసిన నివారణ జరుగును.

*ఆరు ముఖాలు గాని,గణేశ్ రుద్రాక్ష గాని,ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకల తో చేసిన రింగ్ గాని చేతికి కడియం గాని ధరించుట శుభమగును.

*ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టుట,పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా నివారన కలుగును.

*నాగ ప్రతిమ(సుబ్రహ్మణ్య) 27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయట చేత నివారణ మగును.

*ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణమగును.

*నవగ్రహములకు ఇరవైఒక దినములు ప్రదక్షిణలు చేయుటచేత శుభమగును.రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును.

*ప్రతీ ఆదివారం ఉపవాసముంటు నాగదేవతాలయం చుట్టు ప్రదక్షినలు చేస్తు లలితా సహస్రనామావలి గాని,దుర్గా సప్త శ్లోకి పఠించిన శుభమగును.

*అధిక ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును.

*అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం నివారణ అగును.

*నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయట కూడా శాంతి కలిగించును.మంగళవారం రోజు గాని,ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న దోషం నివారణ అగును.

*రాహు కేతువులకు మూలమంత్ర జపములు తర్పనములు హోమము దానము చేయుటచేత కూడా దోష నివారణయగును.

*ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట అభిషేకించుట కూడా సత్ఫలితాలనిచ్చును.

*వెండి నాగ ప్రతిమ చేయించి పదకొండు దినములు మూలమంత్ర సహితముగా పూజించి బ్రాహ్మణునకు దానము చేయుట వలన కూడా దోష నివారణయగును.

*మినుములు.నువ్వులు.ఉలువలు.. ప్రతీ మంగళవారం దానము చేయుచు ఉన్న దోష నివృత్తియగును.
పైన చెప్పిన అన్ని చేయలేకపోయిన కొన్ని అయిన శ్రద్దగా చేసిన దోష నివృతి అగును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *