Manidweepavasini Mangala harathi in Telugu

lalitha e1695391441722
image_print

Manidweepavasini Mangala harathi in Telugu – మణిద్వీపవాసిని మంగళ హారతి

మంగళం శ్రీత్రిపురసుందరికి – మంగళం మణిద్వీపవాసినికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||
భక్తి నొసగి నీ భక్తుల బ్రోవగ- వెలసిన శ్రీ త్రిపురసుందరికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||
మంగళం మంజుభాషిణికి- మంగళమ్‌ రాజీవలోచనికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||
ముజ్జగాలనేలే మాతల్లికి – సకల ముక్తిఫలప్రదాయినికి
మంగళం శుభమంగళం – మంగళమ్‌ నిత్య జయమంగళమ్‌ ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *