Karimala Vasuni Katha Vinarandi Song in Telugu – కరిమల వాసుని కథ వినరండి
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి తారకనాముడు కారణజన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
సత్యలోకమున భారతికి కైలాసమ్మున పార్వతికి సతులందరిలో మహాపతివ్రత ఎవరని కలిగెను సందేహం ఆదిదేవుడు, బ్రహ్మదేవుడు సతులను గూడి వైకుంఠం చేరి విష్ణువుకు వెల్లడించిరి తమ తమ భార్యల సందేహం చిరు చిరు నగవులు చివురులెత్తగా ముగురమ్మలకు దిగులు పుట్టగా మహాపతివ్రత సతి అనసూయని మహావిష్ణువే వివరించే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పూర్ణతో పుష్పలతో అతని వివాహం అసంపూర్ణమైనది అతని ప్రణయజీవితం శివునానతి తలదాల్చి భువిలో జనియించే శాస్త లేకుంటే లేదుకద మహిషి కధ వధ మోహినిపై మరులుగొన్న శివలాస్యం
పద్మదల రాజ్యాధినేత ఆ మాందాత వేటలాడె వేడుకను సాగిరాగ ఘోరాటవీదేశ కృరమృగ మధ్యస్థ గిరి కందరాన ఒక పసికేక వినిపించె శిశు రోదనము విన్న శ్రీమహీపాలకుడు పసిమహావిష్ణువై శిశువైన శివుడిలా బాలార్ధ తేజానగల బాలకుని చూచి ఆశ్చర్యచకితుడై అనురాగచలితుడై బిడ్డపాపలు లేక గొడ్డుపోయిన జన్మ అది మహాఫలముగా అరుదైన వరముగా భావించి బాలకుని ఎత్తుకొని ముద్దాడి తనయుడని ఉప్పొంగి తన రాణికివ్వగా మణిమాలతో ఇంటి మణిదీపమై వచ్చి మణికంఠుడను పేర పెరిగే బాలకుడు
గురుకుల విధ్యాభ్యాసంలో చెరసంధాన ప్రయోగంలో సకలశాస్త్రముల సర్వశస్త్రముల పండితుడయ్యెను పసివాడు గురుదక్షిణగా గురుపుత్రునికే వెలుగునిచ్చె మణికంఠుడు ఇదే సమయమని మహిషి మర్ధనకు ఇదే తరుణమని పందలరాణికి శిరోభారమును కల్పించెను దేవేంద్రుడు రాజవైద్యుడిగ తానే వచ్చి పులిపాలు తప్ప ఆ వ్యాధికి మందేలేదని చెప్పగా
తల్లి భాదకు తల్లడిల్లిన ఆ మణికంఠుడు పాలుతెత్తునని ఘోరాడవికే బయలుదేరెనపుడు కారణజన్ముడు మణికంఠుడికీ జన్మరహస్యం చెప్పె ఇంద్రుడు