Diwali lakshmi pooja vidhi – దీపావళి లక్ష్మీదేవి పూజా విధానం

ప్రాణ ప్రతిష్ఠ
‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
బెల్లం ముక్కను నివేదన చేస్తూ … ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి
అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే
రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః
పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.
కలశ స్థాపన
వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.
‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *