ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా |
ధన్వంతరి మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగును. ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల, ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించినచో ఆ రోగము నుండి ఉపశమనం కలుగును.