రామా….ఆ…రామా…ఆ…ఆ అందరి బంధువయా భద్రాచల రామయ్యా అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండరామయ్యా
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్యా తండ్రిమాటకై పదవిని వదిలి అడవులకేగెనయా మహిలో జనులను ఏలగవచ్చిన మహావిష్ణు అవతారమయా ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోషించేనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా.. కరుణాహృదయుడు శరణనువారికి అభయమొసగునయ్యా
అందరి బంధువయా భద్రాచల రామయ్యా అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండరామయ్యా
బధ్రాచలము పుణ్యక్షేత్రము అంతారామమయం బక్తుడు బద్రుని కొండగ మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తుడు రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ్యా సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా పంచావటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్ధమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామపాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్ధం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా