శ్రీ షిరిడీసాయి చాలీసా

image_print

Sai Babaశ్రీ షిరిడీసాయి చాలీసా

షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం

త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి

దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా || ౧ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి

నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపుధారణలో

కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి

షిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం || ౨ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

చాంద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని

గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి

వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలములను

అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం || ౩ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా

నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి

పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి

జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం || ౪ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని

అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా

ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి

నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి || ౫ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి

చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడీ గ్రామం

అగ్ని హోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి

శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలిగించి || ౬ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

భక్త భీమాజీకి క్షయరోగం నశియించే ఆతని సహనం

ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు

కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి

దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం || ౭ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

కరుణాసింధూ కరుణించు మాపై కరుణ కురిపించు

సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును

ముస్లిం అనుకొని నిను మేఘా తెలుసుకుని ఆతని బాధ

దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము || ౮ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

డాక్టరుకు నీవు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా

నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా

మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా

నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీసాయి || ౯ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం

భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం

పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు

శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి || ౧౦ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

అందరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం

ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును

సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం

సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము || ౧౧ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని

చిత్తముతో సాయీ ధ్యానం చేయండి ప్రతినిత్యం

బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి

సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి || ౧౨ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు

వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి

సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి

భేద భావమును మానండి సాయి మన సద్గురువండి || ౧౩ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

వందనమయ్యా పరమేశా ఆపద్బాంధవ సాయీశా

మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు

కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయీ

మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం || ౧౪ ||

(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *